కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
వరంగల్ ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య
వరంగల్/వరంగల్ తూర్పు మే 22 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వరంగల్ ఎన్నికల అధికారి, కలెక్టర్ పీ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ ఏర్పాట్లు, లెక్కింపు బందోబస్తుపై కలెక్టరేట్‌లో బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. అన్ని ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేయాలని, గుర్తింపు కార్డులు కలిగిన వ్యక్తులను మాత్రమే అనుమతించాలని చెప్పారు. అనంతరం ఏనుమాముల మార్కెట్ యార్డులోని స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాధికగుప్తా, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, డీపీఆర్వో అయూబ్ అలీ, భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామ్‌కుమార్‌రెడ్డి, ఎన్నికల పర్యవేక్షకుడు విశ్వనారాయణ, ఆర్‌అండ్‌బీ ఏఈ శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఎంజీఎంను సందర్శించిన కలెక్టర్
ఎంజీఎంలో మంగళవారం ఏర్పడిన విద్యుత్ అంతరాయంపై సామాజిక మాధ్యమాలలో వచ్చిన వార్తలకు కలెక్టర్ ప్రావీణ్య స్పందించారు. ఎంజీఎం సందర్శించి విద్యుత్ అంతరాయానికి గల కారణాలను ఆర్‌ఎంఓ డాక్టర్ మురళి, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ రామ్‌కుమార్ రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు. ఎన్పీడీసీఎల్ అధికారులతో మాట్లాడి భవిష్యత్తులో విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. జనరేటర్స్ నిత్యం అందుబాటులో ఉండేలా ఆసుపత్రి అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు.






