4 August, 2026 | 1:20 PM

Breaking News

బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రచార జాత

04-08-2026 12:10 PM

హనుమకొండ,(విజయక్రాంతి): బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ప్రజలకు వివరించేందుకు ఆగస్టు 6 నుండి 11 వరకు హనుమకొండ జిల్లాలో ప్రచార జాత నిర్వహిస్తుందని,  ఈ జాతలను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి పిలుపునిచ్చారు. మంగళవారం హనుమకొండ మండలంలోని గుండ్ల సింగారం సురవరం సుధాకర్ రెడ్డి నగర్ లో సిపిఐ ప్రచార జాత ఛలో డిల్లీ వాల్ పోస్టర్లను సిపిఐ నాయకులు విడుదల చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనా సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి మాట్లాడుతూ ఈ దేశంలో బిజెపి ప్రభుత్వం రోజురోజుకు ప్రజలను అణచివేత ధోరణిని అవలంభిస్తుందని, దేశంలో ఏ సమస్యలు లేనట్టు దేవుడు, మతం పేరు మీద ప్రజలను 12 సంవత్సరాలుగా మోసం చేస్తూ వస్తుందన్నారు. ఈ దేశంలో పెరుగుతున్న నిత్యవసర, చమురు ధరలను పెంచుతూ ఈ ధరలు సామాన్య ప్రజలకు అందని ద్రాక్షగా చేసిందన్నారు.

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జిల్లాలో ఆగస్టు 6 నుండి 11 వరకు ప్రచార జాత సిపిఐ నిర్వహిస్తుందని, ఆగస్టు 6వ తేదిన కాజీపేటలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు జాతను ప్రారంభిస్తారని, ఈ జాత జిల్లాలో గ్రామ గ్రామనా యాత్ర చేసి ఆగస్టు 11వ తేదీన హనుమకొండ లోని వేయి స్థంబాల గుడి నుండి పబ్లిక్ గార్డెన్ వరకు ర్యాలీతో ముగిస్తుందని తెలిపారు.

ఆగస్టు 7, 8 తేదీల్లో జరిగే ప్రచార జాతలో సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఈ జాత ద్వారా  కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలకు వివరిస్తూ ప్రతి గ్రామంలో ఉన్న ప్రజా సమస్యల పైన పోరాటాలు కొనసాగిస్తూ సెప్టెంబర్ 1వ తేదీన ఛలో ఢిల్లీతో ముగుస్తుందని అన్నారు. జిల్లాలో జరిగే ప్రచార జాతను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ మండల ఎన్ ఎ స్టాలిన్, మండల సహాయ కార్యదర్శి గుంటీ రాజేందర్, నాయకులు పొనుగోటి రాముగోపాల్ చారి, పూజారి అమృతయ్య, మామునూరి దామోదర్, కేతపాక ప్రసాద్, తాటికొండ ప్రశాంత్, నలువల సంధ్య, తాటికంటి మమత, తోట రామారావు, తిప్పనపల్లి మోహన్, పెనుకుల మధు, పెనుకుల మధు, లక్కం రాజు, రాయబారపు శ్రీనివాస్, రెసోజు రాజు, సిలిమోజు హేమలత, సపవట్ దేవి తదితరులు పాల్గొన్నారు.