శిథిలావస్థలో పశు వైద్యశాల.. భయం భయంగా విధుల నిర్వహణ
బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో ఉన్న పశువైద్యశాల శిఘలా వస్తే చేరుకుంది. దీంతో విధులు నిర్వహించాల్సిన సిబ్బంది భయం భయంగా విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన పశు వైద్యశాల ప్రస్తుతం అవసాన దశకు చేరుకుంది. దీంతో విధులు నిర్వహించి సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. ఆస్పత్రి ఎప్పుడు కూలిపోతుందోనని విధులు నిర్వహించే వారు పేర్కొంటున్నారు.
అయితే గతంలో ఆసుపత్రి స్థలంలోనే మండల పరిషత్, తహసిల్దార్ కార్యాలయాలను నిర్మించి అందులోనే పశు వైద్యశాలను సైతం నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. నూతనంగా మంజూరు అయిన మండల పరిషత్ తాసిల్దార్ కార్యాలయాలను మరోచోట నిర్మించాలని నిర్ణయించారు. దీంతో పశు వైద్యశాల నిర్మాణం కొత్త భవనాలతో పాటు జరగదని తెలిసిపోయింది. అధికారులు ఇప్పటికైనా నూతనంగా పశు వైద్యశాల నిర్మాణానికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆసుపత్రిలో విధులు నిర్వహించడం కష్టతరంగా మారిందని పశు వైద్యశాల సిబ్బంది వాపోతున్నారు.






