12-12-2025 12:00:00 AM
మహేశ్వరం/కందుకూరు, డిసెంబర్ 11 ( విజయ క్రాంతి ) : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని కందుకూరు, మహేశ్వరం మండలాలలో సర్పంచ్ ఎన్నికల ప్రచారాలు హోరెత్తుతున్నాయి.సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నవారు నానా ఇక్కట్లు పడవలసి వస్తుంది. ప్రతి ఇంటి ఇంటికి తిరిగి బిర్యానీ, చికెన్ ప్యాకెట్లు సరఫరా చేయడమే కాకుండా వెంచర్లలో పలు వ్యవసాయ క్షేత్రాలను విందు మందులతో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు నానా ఇక్కట్లకు సర్పంచ్ అభ్యర్థులు గురవుతున్నారు.
మహేశ్వరం మండలంలో 30 గ్రామ పంచాయతీ లలో రెండు గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 28 గ్రామపంచాయతీలలో పోటీ రసవత్తరంగా మారింది. కందుకూరు మండలంలో 35 గ్రామపంచాయతీలలో మూడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా కాగా 32 గ్రామపంచాయతీలలో అభ్యర్థులు పోటీకి సై అంటే సై అంటున్నారు. అభ్యర్థులు గెలుపు కోసం నామినేషన్లు ప్రారంభం కాకముందు నుంచే గ్రామాలలో ఓట్లకు సంబంధించి సర్పంచ్ వార్డు సభ్యులకు గుర్తులు కేటాయింపు వరకు చాలా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం స్తబ్దుగా నడిచింది.
కొన్ని గ్రామాలలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాకముందు నుండే ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని మీఓట్లు తమకే వేయాలని గుర్తులు వచ్చాక కలుస్తామని చెప్పడం ఒకింత ఓటర్లను విస్మయానికి గురిచేసిందని చెప్పవచ్చు.కానీ ఓటర్ల తెలివితేటలు తెలుసుకున్న సర్పంచ్ అభ్యర్థులు ముందు నుండే మందు,విందు లతోపాటు గుర్తులు వచ్చాక చాలా గ్రామాలలో చికెన్ ఫ్రై బిర్యానీ ప్యాకెట్లు తయారు చేసుకుని ఇంటింటికీ పంపిణీ చేసి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రచారాన్ని మరింత వేగే తరం చేశారు.
దీనిని ఆసరాగా చేసుకున్న ఓటర్లు ఎలాగైనా ఆర్థికంగా ఉన్న అభ్యర్థులపై కన్నేసి వారు గెలిస్తే తమకు ఏమి పని చేపిస్తారని గ్రామాల అభివృద్ధి ఏమో కానీ వారి అభివృద్ధిని చూసుకుంటారని చర్చనీయాంశం కూడా గ్రామాలలో విస్తరించింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఓటర్లు ఎన్నికలప్పుడే తప్ప వారిని ఖర్చు పెట్టియ్యాలని ఆలోచనలో సైతం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా మహేశ్వరం,కందుకూరు మండలాలలో జనరల్ స్థానాలలో పోటీ రసవత్తరంగా మారింది.
ఈ ప్రాంతంలో ఫోర్త్ సిటీ రావడం ఈ నెల 8,9 తేదీలలో గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం నిర్వహించి దేశ విదేశాల, ప్రపంచ ప్రతినిధులను పిలిపించి ఇక్కడి ప్రాంతంలో పలు కంపెనీలను పెట్టి నిర్వహించేందుకు అనుకూలంగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవడంలో సఫలమైందని చెప్పవచ్చు.
ఈప్రాంతాలు అభివృద్ధి అయ్యేందుకు ముఖ్యంగా ఫోర్త్ సిటీ నేపథ్యంలో ఈరెండు మండలాలలో సర్పంచ్ స్థానాలకు పోటీ అధికంగా నెలకొంది.ఏది ఏమైనా ఎంత ఖ్చనా వెనుకాడేది లేదని ఆయా మండలాలలోని గ్రామాలలోని సర్పంచ్ అభ్యర్థులు, వార్డులకు పోటీ చేసిన అభ్యర్థులు సైతం లక్షల్లో ఖర్చుకు వెనకాడడం లేదని ఓటర్లు తెలుపుతుండడం గమనార్ధం.