calender_icon.png 12 December, 2025 | 5:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆన్‌లైన్ బెట్టింగ్‌తో అప్పులు.. యువకుడి సూసైడ్!

12-12-2025 12:00:00 AM

ఉప్పల్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా ఉప్పల్ రా మంతాపూర్‌కు చెం దిన అనిల్ అనే యు వకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఆన్‌లైన్‌లో భారీ గణనీయమైన ఆర్థిక నష్టాలు చవిచూసి . అవి తీర్చలేక  ఫ్యానుకు ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.  ఉప్పల్‌ఇన్‌స్పెక్టర్ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ కు చెందిన వల్లోజు అనిల్ కుమార్  (38) ప్రైవేటు ఉద్యోగి  ఆన్ లైన్ బెట్టింగ్‌కుఅలవాటు పడ్డాడు.  తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని లక్షల్లో అప్పలు చేసి బెట్టింగ్ ఆడాడు.

కొంత వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత నష్టాలు రావడంతో కుమిలిపోయాడు.  బుధవారం  రాత్రి   తండ్రి అయిన లక్ష్మణాచారి  భోజనం చేసేందుకు  అనిల్‌ను  పిలిచాడు. అనిల్ ఎంతకీ బయటికి రాకపోవడంతో  తన గదికి వెళ్లి చూడగా గదిలో  సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని వేలాడుతూ కనబడ్డాడు. కుటుంబ సభ్యుల సహాయంతో  దగ్గర్లో ఉన్న మ్యాట్రిక్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అనిల్ పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు