పుల్లూరు బండలో రామయ్య తలంబ్రాల పంపిణి
భద్రాచల తలంబ్రాలు అందుకోవడం అదృష్టమన్న భక్తులు
సిద్దిపేట రూరల్: భద్రాచల రామయ్య కల్యాణ ముత్యాల తలంబ్రాలను సోమవారం సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలోని బండ పై వెలసిన శివాలయంలో పంపిణీ చేసారు. ఈ సందర్భంగా శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు భక్తులచే భజన చేయించి, దేవాలయం చుట్టూ పల్లకి సేవతో తలంబ్రాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు.
అనంతరం తలంబ్రాల పవిత్రత, వాటి విశిష్టత ను తెలియజేసి అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రామయ్య కళ్యానానికి ఈ సంవత్సరం 300కిలోల గోటి తలంబ్రాలు అందించామని, పుల్లూరు గ్రామం నుండి పెద్ద ఎత్తున గోటి తలంబ్రాలు ఓలిచి అందించారని తెలిపారు. భద్రాచలం నుండి 100కిలోల ముత్యాల తలంబ్రాలు భక్తుల కోసం తీసుకొచ్చానన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షులు దేశెట్టి రాజు, గడ్డ మాధవరెడ్డి, కుంచం లత, బాలకిషన్, సురేష్, భక్తులు పాల్గొన్నారు.






