03-02-2026 12:00:00 AM
కరీంనగర్, ఫిబ్రవరి 2 (విజయ క్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థలో చాలా డివిజన్లలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు చేసిన బు జ్జగింపులు పనిచేయలేదు. యువజన కాంగ్రె స్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ అజీం 45వ డివిజన్ టికెట్ ఆశించగా టికెట్ పెద్దపల్లి రజనీకి ఫైనల్ చేయడంతో ఆయన పా ర్టీ నేతలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కు చురుకైన కార్యకర్తగా, నాయకునిగా పనిచేస్తున్న అజీమ్ ఆయన డివిజన్ బీసీ మహిళ కు రిజర్వ్ కావడంతో సతీమణి కోసం ప్ర యత్నం చేశారు. అయితే ఇటీవలే పార్టీలో చేరిన పెద్దపల్లి రజనీకి సోమవారం టికెట్ ఫైనల్ చేయడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు.
దీనికంతటికి కారణం నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావే అంటూ తీవ్ర స్థాయిలో మండిపడడమే కా కుండా తన ఆవేదనను వెళ్లబోస్తూ వీడియో క్లిప్పింగ్ లను సోషల్ మీడియాలో విడుదల చేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో పా ర్టీని దెబ్బతీసే విధంగా కొందరు వ్యవహరిస్తున్న తీరును ఆయన దుయ్యబట్టారు. ఇలా అయితే నగరపాలక సంస్థపై కాంగ్రెస్ జెండా ఎగరడం కష్టమని అన్నారు.
వెలిచాల రాజేందర్ రావుకు దమ్ముంటే తన రాజీనామాను ఆమోదించాలని సవాల్ విసిరారు. అలాగే కొత్తపల్లి పరిధిలోని 18వ డివిజన్ లో టికెట్ల పంచాయతీ తారాస్థాయికి చేరింది. ఇక్కడి నుండి ఇద్దరు సీనియర్ బిఆర్‌ఎస్ నేతలు జమీలుద్దీన్, బండ గోపాల్ రెడ్డిలు టికెట్ ఆశించారు. సోమవారం రాత్రి జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ కార్పొరేటర్ ఎడ్ల అశోక్ తో కూడిన త్రిసభ్య కమిటీ అభిప్రాయ సేకరణ చేపట్టింది. అయితే 18వ డివిజన్ అభిప్రాయ సేకరణ 17వ డివిజన్ అభ్యర్థి ఇంట్లో నిర్వహించడం.
అక్కడి వారితో నిర్వహించడంపై బండ గోపాల్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బండ గోపాల్ రెడ్డి సతీమణి గతంలో కొత్తపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ గా పనిచేశారు. ఇప్పుడు కార్పొరేషన్లో విలీనం కావడంతో ఆయన టికెట్ ఆశించారు. టికెట్ జమీలుద్దీన్ కే కేటాయించడంతో తీవ్ర మనోవేద నకు గురైన బండ గోపాల్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండేందుకు నిర్ణయించుకున్నారు.
అలాగే హనుమాన్ నగర్ పరిధి లో కాంగ్రెస్ టికెట్ ఆశించిన బత్తిని చంద్ర య్య గౌడ్ కు చివరి క్షణంలో టికెట్ నిరాకరించడంతో సీనియర్ కార్యకర్త అయిన ఆయన కూడా అలక వహించారు. ఇలా ప లు డివిజన్లలో ఈ పరిస్థితి నెలకొంది. నామినేషన్ల ఉపసంహరణ మంగళవారం ఉండ గా ఇంకా వీరిని బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.