03-02-2026 12:00:00 AM
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
బోయినపల్లి: ఫిబ్రవరి 2 (విజయ క్రాంతి): రైతులకు వెన్నుదన్నుగా ఉండడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బో యినపల్లి మండల కేంద్రంలో రైతు వేదికలో వ్యవసాయ యాంత్రికరణ పథకం కింద 31 మంది లబ్ధిదారులకు రూ. 6.78 లక్షల విలువైన 16 తైవాన్ పంపులు, 4 నాగళ్ళు, 2 కేజీ వీల్స్, 5 రోట్ వేటర్లు, మూడు బ్రష్ కట్టర్స్, ఒక పవర్ టిల్లర్ రైతులకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అందించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండదండగా నిలిచి వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. అం దులో భాగంగానే ఇప్పుడు రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద ఈ పనిముట్లు అందించినట్లు చెప్పారు. సాగులో కూడా వ్యవసాయ అధికారులు రైతులకు క్షేత్రస్థాయిలో అం దుబాటులో ఉండి సలహాలు సూచనలు ఇస్తున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా డీసీ ఎంఎస్ మాజీ చైర్మన్ ముదుగంట సురేందర్ రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, మాజీ ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు కుస రవీందర్, ఏవో ప్రణీత,సర్పంచులు నల్లమోహన్, భీమ్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి, ఎనుగుల కనకయ్య, ఉయ్యాల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.