02-02-2026 12:00:00 AM
ఘట్‌కేసర్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): ఘట్‌కేసర్ పట్టణానికి ప్రధాన సమస్యగా మారిన రైల్వే వంతెన నిర్మాణం 17 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ పూర్తికాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్న కాలంలో అప్పటి మేడ్చ ల్ ఎమ్మెల్యే కిచ్చనగారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన ఈ వంతెన పనులు నేటికీ కాగితాలకే పరిమితమయ్యా యి. రైల్వే వంతెన నిర్మాణం ఆలస్యం కావడం వల్ల ప్రజలు ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, అత్యవసర సేవలు అన్నీ ఈ సమస్యతో నిత్యం ప్రభావితమవుతున్నాయి. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతూ, ప్రమాదాలకు దారితీస్తోంది. ఈ దీర్ఘకాలిక నిర్లక్ష్యానికి నిరసనగా, ఆదివారం పార్టీలకు అతీతంగా దాదాపు 500 మందికి పైగా స్థానిక యువకులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, రైల్వే వంతెన పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించి పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.