calender_icon.png 6 May, 2025 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రవాద దాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

24-04-2025 12:24:45 AM

గజ్వేల్, ఏప్రిల్ 23:  జమ్ము కాశ్మీర్లో ఉగ్రవాద దాడికి నిరసనగా  బుధవారం గజ్వేల్ పట్టణంలో ప్రజలు అన్ని పార్టీల నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదుల దాడి హేయనీయమైన చర్య అని, ఉగ్రవాద చర్యల విషయంలో ప్రజలు ఏకమై నిరసన తెలుపడం ప్రజల్లోని జాతీయతా భావాన్ని తెలియపరుస్తుందని కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్లు రాజమౌళి, భాస్కర్, ఏఎంసి  వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి లు  అన్నారు.