24-04-2025 12:23:04 AM
విలేకరుల సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టీ.నాగరాజు
ఖమ్మం, ఏప్రిల్ 23 (విజయక్రాంతి) : -భారత విద్యార్ధి ఫెడరేషన్(ఎస్‌ఎఫ్‌ఐ) తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు ఈనెల 25 నుండి 27వరకు ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో జరుగుతున్నాయని ఈ మహాసభలను ఖమ్మం జిల్లా విద్యార్ధిలోకం జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు కోరారు.సుందరయ్య భవనంలో ఎస్‌ఎఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, ఖమ్మం జిల్లా కార్యదర్శి టి.ప్రవీణ్, జిల్లా ఉపాధ్యక్షుడు డి.వెంకటేష్ లతో జరిగిన విలేఖరుల సమావేశంలో టి.నాగరాజు మాట్లాడారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మంలో 2002 తర్వాత రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న రాష్ట్ర మహాసభలలో 33 జిల్లాల నుండి10రాష్ట్ర యూనివర్శీటీలు,06సెంట్రల్ యూనివర్శీటీలు నుండి 600 మంది విద్యార్ధి ప్రతినిధులు 3రోజుల పాటు పాల్గోంటారని తెలిపారు.
మొదటిరోజు 25న ఉదయం 11:00 గంటలకు జడ్పీ సెంటర్ నుండి వేలాది మందితో ప్రదర్శన ప్రారంభం అవుతుందని అనంతరం భక్తరామదాసు కళాక్షేత్రంలో బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. 25వ తేదీన నిర్వహించే ర్యాలీ బహిరంగ సభలో అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు దొంతబోయిన వెంకటేష్, నాయకులు వినోద్, లోకేష్, త్రినాథ్, సుశాంత్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.