30-04-2025 12:00:00 AM
జహాజరైన గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్
ముషీరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): భారత భూభాగంలో భూతల స్వర్గంగా పేరుగాంచిన కాశ్మీర్ లోనీ పహాల్గాంలోకి రాక్షస పాకిస్థాన్ ఉగ్రవాదులు చొరబడి 26 మంది హిందూ పర్యాటకులను అతి కిరాతంగా హతమార్చిన దుశ్చర్యకు నిరసనగా, తమ ప్రాణాలను పోగొట్టున్న హిందూ వీరులకు మంగళవారం రాత్రి కొవ్వొత్తులు వెలి గించి నివాళులర్పించారు.
గాంధీనగర్ డివిజన్ బీజేపీ శ్రేణులు, ఆంధ్ర కేఫ్ చౌరస్తాలో డివిజన్ బిజెవైఎం ఆధ్వర్యంలో అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ నిర్వహించిన కార్యక్రమంలో ము ఖ్య అతిథిగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ పాల్గొన్నా రు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు వి.నవీన్ కుమార్, సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, శ్రీకాంత్, మహమూద్, సత్తిరెడ్డి, ప్రకాష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, శివ కుమార్, మదన్మోహన్, గ్యనేశ్, శ్రీనివాస్, నర్సింహ, సాయికుమార్, ఆనంద్‌రావు, దోనేటి సత్యం,సత్యేందర్, హన్మంతు, డి.కుమార్, సాయి, బిజెవైమ్ నేతలు అరుణ్ కుమార్,నీరజ్,సాయి తరుణ్, సంపత్ యాదవ్, రాహుల్, సాయి తేజ, భాను, చిన్న, అభిషేక, ప్రశాంత్, రాజ్‌కుమార్, సంధ్యారాణి, స్వప్న, సంయుక్త రాణి, కృష్ణ వేణి స్థానికులు భారీఎత్తున పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించారు.