calender_icon.png 22 August, 2025 | 12:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ 53 లక్షల విలువగల గంజాయి స్వాధీనం

22-08-2025 08:52:28 AM

  1. రూ 53 లక్షల విలువగల గంజాయి స్వాధీనం.
  2. ఒక క్రిస్టల్, ఐదు రివాల్వర్లు 43 బుల్లెట్లు స్వాధీనం 
  3. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ 

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో గురువారం భారీ ఎత్తున నిషేధిత గంజాయి, మారుణ ఆయుధాలని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. వారు తెలిపిన వివరాల ఎక్సైజ్ కమిషనర్ శ్రీ హరి కిరణ్, డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ షానవాజ్ ఖాసీం ఆదేశాల మేరకు అసిస్టెంట్ కమిషనర్ పర్యవేక్షణలో పాల్వంచలో వాహన తనిఖీ లో నిర్వహిస్తున్న క్రమంలో టిఎన్ 18 బిసి 96 94 వ్యాన్, టి ఎన్ ఫైనాన్స్ సిసి 8104 కార్లను తనిఖీ చేయగా రూ 53 లక్షల విలువగల 106 నిషేధిత గంజాయిని గుర్తించడం జరిగింది. వాహనాల్లో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేయగా ఒరిస్సా నుంచి ఇట్టి నిషేధిత గంజాయిని భద్రాచలం కొత్తగూడెం ఖమ్మం చెన్నైల మీదుగా తిరుచికి తరలిస్తున్నట్లు అంగీకరించారు.

గంజాయి రవాణా దారులతో కలిసి కేరళలోని గ్యాంగ్స్టర్, అక్రమ ఆయుధాలను మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో కొనుగోలు చేసి కేరళలోని కొచ్చెనికి తరలిస్తున్నట్లు విచారణలో వెళ్లడైందన్నారు. తదుపరి విచారణ కోసం అట్టే మారన ఆయుధాల్ని పాల్వంచ పోలీస్ స్టేషన్ కి అప్పగించామన్నారు. నావల్ ఆర్నమెంట్, వెలుకొండం, చెందిన బిలాల్ వి ఎస్, తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి, తోరియూర్ కు చెందిన శ్యాం సుందర్, తమిళనాడు రాష్ట్రం తెరచ్చి జిల్లా, తిరుయూర్ కు చెందిన కాశీ నందన్ సంతోష్ లను అరెస్టు చేయగా తిరుచ్చి కి చందన జేమ్స్ పరారీలో ఉన్నట్టు తెలిపారు.

వారి నుంచి 106 కేజీల గంజాయిని, టి ఎన్ 18 బిసి 96 94 నెంబర్ గల వ్యాను, టిఎన్ 59 సిసి 8104 కారును, ఒక పిస్టల్, ఐదు రివాల్వర్లు, 40 బుల్లెట్స్, 12 కాళీ మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పట్టుబడిన ముగ్గురు వ్యక్తులను జెర్సీఎల్ రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచామన్నారు. నిషేధిత గంజాయి అక్రమ రవాణాను సమర్థవంతంగా అడ్డుకొని నిందితులను పట్టుకున్న అండ్ ఫోర్స్ మెంట్ అధికారులు జి గణేష్ అసిస్టెంట్ కమిషనర్ ఎస్ రమేష్ ఇన్స్పెక్టర్ సిహెచ్ శ్రీహరి రావు సబ్ ఇన్స్పెక్టర్, సిబ్బంది కరీం బాలు సుధీర్ వెంకటేశ్వర్లు హనుమంతరావు విజయ్ హరీష్ వీరబాబు ఉపేందర్లను కమిషనర్ అండ్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ లు అభినందించారు.