22-08-2025 10:42:06 AM
మద్నూర్, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు(Jukkal MLA Thota Lakshmi Kanta Rao) సమక్షంలో బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. డోంగ్లీ మండలం మొఘ గ్రామానికి చెందిన బీజేపీ యూత్ అధ్యక్షులు, యువ నాయకులు, కార్యకర్తలు గురువారం బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వీరికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... యువత కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభపరిణా మమనిఅన్నారు..కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఓట్ల దొంగతనం చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని అన్నారు.ప్రజల హక్కులను కాలరాస్తూ, ప్రజాస్వామ్యాన్ని మంట కలుపుతున్న బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పి గద్దె దించే వరకు మన నాయకులు రాహుల్ గాంధీ కి మద్దతుగా నిలుస్తూ పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మద్నూర్ ఏఎంసీ వైస్ ఛైర్మన్ పరమేశ్ పటేల్ , తదితరులు పాల్గొన్నారు.