calender_icon.png 22 August, 2025 | 3:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి రాకతో అధికారుల హడావిడి

22-08-2025 12:14:59 PM

మునిపల్లి చౌరస్తాలో ఉన్న గుంతను పూడ్చిన అధికారులు 

మునిపల్లి (విజయక్రాంతి): మండల కేంద్రమైన మనిపల్లి చౌరస్తాలో గత కొంత కలంగా గుంత ఏర్పడింది. వర్షం పడితే అది చెరువుల మారేది. అయితే ఈ గుంతను పూచండి అంటూ అధికారులకు స్థానికులు విన్నవించినప్పటికీ పూర్తి లేదు. కానీ శుక్రవారం నాడు మండలంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన సందర్భంగా అధికారులు హడావిడి చేశారు. అధికారులకు ఈ గుంత కనబడలేదేమో .. మంత్రి వస్తున్నాడు అని తెలుసుకున్న అధికారులు.. మునిపల్లి చౌరస్తాలో ఉన్న గుంతను పూడ్చివేయించారు. అయితే మంత్రి వస్తేనే పనులు అవుతాయి లేకుంటే అధికారులకు చీమ కుట్టదేమో అనుకుంటున్నారు స్థానికులు.. ఇప్పటికైనా గుంతను పూడ్చడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..