calender_icon.png 22 August, 2025 | 1:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పనుల జాతర.. మల్లారంలో మంత్రి పొన్నం పర్యటన

22-08-2025 09:56:23 AM

  1. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి.. రైతులకు నీళ్లందిస్తా: మంత్రి పొన్నం
  2. రైతులను రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోంది
  3. 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాం

హైదరాబాద్: హనుమకొండ జిల్లా(Hanumakonda District) భీమదేవరపల్లి మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్(Minister Ponnam Prabhakar Goud) శుక్రవారం పర్యటిస్తున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలో 12 లక్షల రూపాయల వ్యవయంతో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి అనంతరం వీర్లగడ్డ తండా లో 20 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి పొన్నం ప్రారంభించారు. అంతకు ముందు హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని వీరభద్ర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించన మంత్రి పొన్నం గోమాతలకు ఆహారం సమర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ... గౌరవెల్లి ప్రాజెక్టుకు(Gouravelli Project) భూసేకరణ జరుగుతోందని తెలిపారు. హనుమకొండ జిల్లాలో భూసేకరణకు రూ. 25 కోట్లు కేటాయించినట్లు వివరించారు. ఎన్ జీటీ కేసుకు సంబంధించి ప్రభుత్వం రూ. 10 కోట్లు చెల్లించిందని వెల్లడించారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంత రైతులకు నీళ్లందిస్తామని హామీ ఇచ్చారు. రైతులను రెచ్చగొట్టేలా బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) వ్యవహరిస్తోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని తెలిపారు.కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి రిజర్వేషన్లు సాధించుకోవాలని పిలుపునిచ్చారు.