calender_icon.png 22 August, 2025 | 3:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్

22-08-2025 11:56:23 AM

బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): చలో సచివాలయం కార్యక్రమానికి వెళుతున్న బిజెపి నాయకులను(BJP leaders arrested) పోలీసులు శుక్రవారం ముందస్తుగా అరెస్టుగా చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల పడిన వర్షాలకు శిథిలావస్థకు చేరిన రోడ్లు  డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయాలని చలో సచివాలయం సేవ్ తెలంగాణ(Save Telangana) అని పిలుపునిచ్చారు.  బెల్లంపల్లి మండల అధ్యక్షులు గజెల్లి రాజ్ కుమార్  ఆధ్వర్యంలో ఛలో సచివాలయానికి బయలుదేరిన బెల్లంపల్లి మండల బిజెపి నాయకులను పోలీసులు అడ్డుకొని ముందస్తుగా అదుపులో తీసుకొని తాళ్లగురజాల పోలీసు స్టేషన్ తరలించారు. అరెస్టు అయినవారిలో బిజెపి  మండల అధ్యక్షుడు గజెల్లి రాజ్ కుమార్ , ప్రధాన కార్యదర్షులు ముత్తే రామన్న, గాదర్ల నగేష్ కార్యదర్శి సాయి నాయకులు మహేష్ ఉన్నారు.