calender_icon.png 22 August, 2025 | 11:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళితుల స్మశాన వాటిక దర్జాగా కబ్జా

22-08-2025 08:20:42 AM

మోతె: మండల కేంద్రంలోనీ దళితుల శ్మశాన వాటికను చుట్టు భూమి ఉన్నవారు దర్జాగా కబ్జా చేసి పంటలు సాగు చేస్తున్నారు. గ్రామంలోని సర్వే నెంబర్ 6/12  లో సుమారు 3 ఎకరాల 12 గుంటల ప్రభుత్వ భూమిని  కబ్జా చేసారు. దీనిలోని ఉన్న దళితులకు చెందిన స్మశానంను సైతం ఆక్రమణ చేసారు. ఇది చాలదన్నట్లు దానిలో ఓ ఇంటి కరెంట్ మీటర్ పెట్టి పంటకు నీళ్లు పెడుతున్నారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన మీటర్ సర్వీస్ నెంబర్ 1191 ఉండగా  ఆది బొక్క సావిత్రమ్మ పేరుతో చూపుతోందంటూ గ్రామస్తులు చెపుకుంటున్నారు. ఆ మీటర్ ఏర్పాటు పై లైన్ మెన్ ను వివరణ కోరగా స్థానికులతో దురుసుగా మాట్లాడినట్లు చెప్పారు.

అయితే ఇదే విషయంపై విద్యుత్ శాఖ ఏ ఈ శాంతినీ వివరణ కోరగా ఈ నెంబర్ పై ఉన్న మీటర్ ఇంటి వద్ద పెట్టుకునేది అని పొలం వద్ద పెట్టకూడదని వివరించారు. అక్రమంగా భూమి ఆక్రమించుకోవడంతో పాటు తప్పుడు విధానంలో కరెంట్ మీటర్  పెట్టారంటూ గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. దళిత కుటుంబాలకు చెందిన వారినీ ఖననం చేసుకోవాడానికి స్మశానం లేకుండా చేస్తున్న వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే కరెంటు మీటర్ మార్చిన పట్టించుకోని లైన్మెన్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇదిలా ఉండగా అసలు కరెంటు మీటర్ ను అక్కడ  ఏర్పాటు చేయడంలో ఉన్న ఆంతర్యం ఏంటో ఎవరికి అర్థం కాకపోవడం గమనార్హం.