calender_icon.png 21 July, 2025 | 5:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళ్ల పారాణి ఆరక ముందే.. కడతేరి పోయిన వధూవరులు

09-08-2024 01:45:07 PM

ఆ ఇద్దరూ కళ్యాణ మండపంలో పెళ్లి పీటలపై తలంబ్రాలు పోసుకుని వివాహ ఘట్టానికి వన్నె  తెచ్చారు. వధువు లిఖిత శ్రీ(20), నవీన్ (29) ఆశీర్వచనం అనంతరం విశ్రమించడానికి పెళ్లి మండపం పక్కనే  మరో గది లోకి వెళ్లారు. అలా వెళ్లిన వారు ఎంతకీ తిరిగి రాక పోవడం తదనంతరం గదినుంచి పెద్ద పెద్ద అరుపులు వినిపించడంతో  పెద్దలు వెళ్లి బలవంతంగా తలుపులు  తెరిచారు. పరస్పరం దాడి చేసుకున్నట్లుగా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు రక్తపు మడుగులో పడి ఉండటంతో అందరూ నిర్ఘాంత పోయారు. కర్ణాటకలో జరిగిన ఈ ఘటనలో ఆఘమేఘాలపై  ఆస్పత్రికి తరలించగా మరణించినట్లు నిర్ధారించారు.