18 May, 2026 | 11:30 PM

పెద్దసారుకు టైమ్ దొరకట్లేదా?

25-08-2024 02:20 AM

రూ.2 లక్షల రుణమాఫీపై రాష్ట్రంలోని అధికార, విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆ ర్‌ఎస్ దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. బీఆర్‌ఎస్ కీలక నేతలు కేటీ ఆర్, హరీశ్‌రావు.. రేవంత్‌రెడ్డి సర్కారుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నా రు. కాంగ్రెస్ నాయకులు సైతం అదే స్థాయిలో బీఆర్‌ఎస్‌పై కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. రుణమాఫీపై సాధారణ రైతులు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు రొడ్డెక్కుతుంటే.. ఆ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత కేసీఆర్ ఇంతవరకు ఒక్క మాటా మాట్లడలేదు. తాము రోడ్లపై ఆందోళన చేస్తుంటే రుణమాఫీపై మాట్లాడేందుకు పెద్దసార్ (కేసీఆర్)కు టైమ్ దొరకట్లేదా? అని బీఆర్‌ఎస్ శ్రేణలు, రైతులు చర్చించుకుంటున్నారు.