14 July, 2026 | 4:45 PM

Breaking News

ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •  

నాణ్యమైన వైద్య విద్య కోసం టాస్క్ ఫోర్స్

25-08-2024 02:25 AM

మంత్రి దామోదర్ రాజనర్సింహ

హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): రాష్ర్టంలో నాణ్యమైన వైద్య విద్యను అందించడానికి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ అన్ని  ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో బోధన సిబ్బంది నియామ కాలు, మౌలిక సదుపాయాల కల్పనను పర్యవేక్షిస్తుందన్నారు. అంతేకాక యూజీ, పీజీ అడ్మిషన్ల భర్తీపె కూడాై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. హైదరాబాదులోని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశా లలో బోధన సిబ్బంది హాజరుపై ప్రత్యేక దృష్టి సాధించాలని ఆదేశించారు.  రాష్ర్టం లో వైద్య విద్యను పటిష్ట పరిచేందుకు, వైద్య రంగాన్ని బలోపేతం చేయడానికి ఈ కమిటీ చర్యలు చేపట్టాలని అధికారులను  మంత్రి  ఆదేశించారు.  సమీక్షలో వైద్య, ఆరోగ్య ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ డా. క్రిస్టినా జెడ్ చోంగ్తూ, ఉప కార్యదర్శి వినయ్ కృష్ణారెడ్డి, డీఎంఈ డా. వాణి, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ హేమంత్ వాసుదేవరావు, ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.

టాస్క్‌ఫోర్స్ కన్వీనర్‌గా డీఎంఈ

నాణ్యమైన వైద్య విద్యను అందించడం తో పాటు మెడికల్ యూజీ, పీజీ అడ్మిషన్ల భర్తీపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ మెంబర్ కన్వీనర్‌గా డీఎంఈనియమించారు. సభ్యులుగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (అకాడమిక్), కేఎన్‌ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సెస్ రిజిస్ట్రార్, ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్స్‌ను నియమిస్తూ రాష్ర్ట వైద్య ఆరోగ్యశాఖ జీవో ఉత్తర్వులను జారీ చేసింది.