బస్తీ దవాఖాన భవనం విస్తరణకు శంకుస్థాపన
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
కుషాయిగూడ, మార్చి 14 (విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గంలోని డా. ఏఎస్ రావు నగర్లో ఉన్న బస్తీ దవాఖాన భవనం విస్తరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై భవనం విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో బస్తీ దవాఖాన భవనాన్ని విస్తరించ నున్నట్లు తెలిపారు. విస్తరణ పనులు పూర్తయిన అనంతరం మరింత మంది ప్రజలకు సౌకర్యవంతంగా వైద్య సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఎస్. సోమశేఖర్ రెడ్డి, సిపిఐ నాయకుడు బోస్, డాక్టర్ సత్యవతి (పీఐసీ & ఎస్‌ఓ), డాక్టర్ ఆర్. కృష్ణారావు పాల్గొన్నారు.




