15 April, 2026 | 12:36 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

‘ఆపద సమయంలో సీఎంఆర్‌ఎఫ్ ఆసరా’

25-06-2025 01:35 AM

మేడ్చల్, జూన్ 24(విజయ క్రాంతి): పేద ప్రజలకు ఆపద సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఆసరాగా ఉంటుందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గ పరిధిలోని పలువురికి మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలు కొన్ని సందర్భాలలో తప్పనిసరి పరిస్థితుల్లో కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోందని, చికిత్స అనంతరం అప్పు చేసి బిల్లు చెల్లిస్తున్నారన్నారు. ఇలాంటి వారికి సీఎంఆర్ ఎఫ్ కొంత ఉపశమనం కలిగిస్తోందన్నారు. మౌలాలి డివిజన్ కి చెందిన చంద్రకళకు రూ.21 వేలు, సునీతకు రూ.21 వేలు, వినాయక నగర్ డివిజన్ కి చెందిన ఇందిరకు రూ.60 వేల చెక్కులను అందజేశారు.

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సిఫారసు మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరైనందున లబ్ధిదారులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, జేఏసీ వెంకన్న, అమీనుద్దీన్, భాగ్యానంద్ రావు, ఉస్మాన్, మారుతి ప్రసాద్, వంశీ పాల్గొన్నారు. 

ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపిన బస్తీ వాసులు 

గౌతమ్ నగర్ డివిజన్లోని జయగిరి లక్ష్మీ నరసింహ నగర్, న్యూ వెంకటేశ్వర నగర్, హిల్ టాప్ బస్తీ వాసులు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బస్తివాస్తుల ఇళ్లకు తాళాలు వేసి, నోటీసులు అందజేయగా ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి తన సొంత ఖర్చులతో లాయర్లను సంప్రదించి స్టే ఆర్డర్ తెప్పించారు. దీంతో కాలనీవాసులు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, వెంకన్న, బైరు అనిల్, సిద్ధి రాములు, కృష్ణ గౌడ్, కాటంరాజు తదితరులు పాల్గొన్నారు.