మణికొండలో కారు బీభత్సం.. మహిళకు తీవ్రగాయాలు
13-01-2025 05:51 PM
హైదరాబాద్: నగరంలోని మణికొండ(Manikonda) తానేషానగర్ లో ఆదివారం ఓ కారు బీభత్సం సృష్టంచింది. రాంగ్ రూట్ లో వచ్చిన కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న మహిళకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ప్రమాదస్థలికి చేరుకున్న రాయదుర్గం పోలీసులు గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన ప్రమాద దృశ్యాలను సీసీ కెమెరాలో తనిఖీ చేసిన రాయదుర్గం(Rayadurg) పోలీసులు కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.






