15 April, 2026 | 9:09 AM

కారు-మోటార్ సైకిల్ ఢీ

04-11-2025 07:32 PM

భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు..

బాన్సువాడ (విజయక్రాంతి): కారు మోటార్ సైకిల్ ఢీకొన్న సంఘటనలో భర్త మృతిచెందగా, భార్యకు తీవ్ర గాయాలైన సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొయ్యగుట్ట తండా వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామానికి తమ బంధువుల ఇంటికి వెళ్లడానికి మోటార్ సైకిల్ పై భార్యాభర్తలు ఇద్దరు వెళ్తుండగా కోయగుట్ట తండా వద్ద మూలమలుపు వద్ద కారు, ఎక్సెల్ ద్విచక్ర వాహనం ఢీకొనడంతో కేతావత్ వసురం అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.

అతని భార్య బూరీ బాయికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడు సంగారెడ్డి జిల్లా నాగాధార మండలం ఘర్కు చెందిన తండా వాసిగా పోలీసులు గుర్తించారు. నాగధార నుంచి కామారెడ్డి జిల్లా కోనాపూర్ గ్రామం బంధువుల కలవడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు ఎస్.హెచ్.ఓ. తుల శ్రీధర్ తెలిపారు.