కారు ద్విచక్ర వాహనం ఢీ
ఇద్దరి పరిస్థితి విషమం..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా(Nalgonda District) కేంద్రంలోని సాగర్ రోడ్డు ఎస్ఎల్బీసీ చాకలి ఐలమ్మ బొమ్మ వద్ద మంగళవారం కారు బైక్ ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. టైర్ బ్లాస్ట్ కారణంగా అదుపుతప్పి బైకును ఢీకొన్న మారుతి బ్రీజా కారు ఇద్దరు వాహన దారుల పరిస్థితి విషమంగా ఉంది. వాహనదారులను ఢీకొని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పై కారు దూసుకెళ్లడంతో నిర్వాకులు తప్పించుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న వన్ టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తన సిబ్బందితో వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని చికిత్స కోసం క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారులో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవడం వల్ల కారులో ఉన్న వ్యక్తులకు చిన్నచిన్న గాయాలు తగిలాయి. ప్రమాదంలో తీవ్ర గాయపడిన ఇద్దరు వ్యక్తులు టేకులగూడెం చెందిన వారిగా గుర్తించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.






