15 June, 2026 | 1:58 AM

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

15-06-2026 12:46 AM

మహబూబాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): తొర్రూరు పట్టణంలోని భద్రకాళి దేవాలయం సమీపంలో ఆదివారం పెట్రోల్ ట్యాంకర్ మోటార్ సైకిల్ ను ఢీకొట్టడంతో తొర్రూరు మండలం గుర్తురు గ్రామానికి చెందిన జడల నవీన్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నవీన్ తన బ్పై వినుకొండగా ఎదురుగా వస్తున్న పెట్రోల్ ట్యాంకర్ ఢీకొనడంతో  అదుపుతప్పి కిందపడిపోయాడు.

ప్రమాదం జరిగిన తీవ్రతకు నవీన్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తొర్రూరు ఎస్‌ఐ తోట మహేందర్ రెడ్డి తెలిపారు. నవీన్ మృతితో గుర్తురు గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.