కేర్ హాస్పిటల్స్ వారి ‘స్వస్థ్ రథ్’

17-09-2026 | 05:10am

ప్రజల చెంతకే ఆరోగ్య పరీక్షలు

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య పరీక్షల(Basic health checkups) ను చేరువ చేయడంతో పాటు నివారణ ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు కేర్ హాస్పిటల్స్ ‘స్వస్థ్ రథ్’ కార్యక్రమాన్ని(Swasthya Rath Program) ప్రారంభించింది. మలక్‌పేట్‌లోని కేర్ హాస్పిటల్స్ లో ఏఐఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ స్వస్థ్ రథ్‌ను జెండా ఊ పి ప్రారంభించారు. కార్యక్రమంలో చాదర్ఘాట్ సీఐ మురారి, ఆసుపత్రి చీఫ్ ఆపరే టింగ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ఎడ్ల, ఎంఓడీ డాక్టర్ శ్రీధర్, సీనియర్ వైద్యులు పాల్గొన్నా రు.

ప్రత్యేకంగా రూపొందించిన ఈ స్వస్థ్ రథ్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది. కాలనీలు, కమ్యూనిటీ కేం ద్రాలు, నివాస ప్రాంతాలు, పార్కులు, సీనియర్ సిటిజన్ క్లబ్‌లు తదితర ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు నివారణ ఆరోగ్యం పై అవగాహన కల్పించనుంది. ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించేందుకు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, అవసరమైనప్పుడు సకాలంలో వైద్యులను సంప్రదించడంపై ప్రజలకు సూచనలు అందించనున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మిర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ మాట్లాడుతూ, ఆరోగ్య సేవలు ప్రజలకు ఎంత దగ్గ రగా ఉంటే అంత ప్రయోజనం. స్వస్థ్ రథ్ ద్వారా కాలనీలు, కమ్యూనిటీ ప్రాంతాల్లోనే ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు అందించడం మంచి కార్యక్రమం అన్నారు. ప్రవీణ్ కుమా ర్ ఎడ్ల మాట్లాడుతూ.. స్వస్థ్ రథ్ ద్వారా ప్రజలు నివసించే ప్రాంతాలకే ప్రాథమిక ఆరోగ్య పరీక్షలను తీసుకెళ్తున్నాం.

ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యే వరకు వేచి చూడకుండా ముందుగానే పరీక్షలు చేయించుకునే లా ప్రజలను ప్రోత్సహించడమే మా లక్ష్యం. స్వస్థ్ రథ్ ద్వారా సేవలు పొందే వారికి కేర్ హాస్పిటల్స్ చేపడుతున్న ‘కేర్ సంఘం’, సీనియర్ సిటిజన్ల కోసం ‘ప్రణామ్’ కార్యక్రమా ల్లో ఉచిత సభ్యత్వం కల్పించనున్నారు.

మరిన్ని వార్తలు