13 July, 2026 | 1:44 AM

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పొరపాట్లు లేకుండా చూసుకోవాలి

13-07-2026 12:42 AM

ఎమ్మెల్యే పద్మావతి

కోదాడ, జూలై 12 : అధికారులు, సిబ్బంది ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో పొరపాట్లు లేకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. పట్టణంలో జరుగుతున్న ఎస్ ఐ ఆర్ సర్వేను ఆదివారం ఆమె పరిశీలించి మాట్లాడారు. సాధారణ ప్రజలు ఓటు హక్కు కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఓటర్ల నుంచి సమగ్రంగా సమాచారం సేకరించి తప్పులు దొర్లకుండా నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఎర్నేని కుసుమ బాబు, వైస్ చైర్మన్ మల్లేశ్వరి, కౌన్సిలర్లు కందుల కోటేశ్వర్లు, తూనం కృష్ణ, కట్టెబోయిన శ్రీను, పిల్లుట్ల శ్రీను, బీఎల్వోలు పాల్గొన్నారు.