13 July, 2026 | 1:48 AM

120 పెట్రోలింగ్ వాహనాలు

13-07-2026 12:43 AM
  1. కొనుగోలుకు సీఎం ఆమోదం
  2. రహదారులపై తనిఖీలకు వినియోగం
  3. డీటీవో వెంకన్న మృతి ఘటనతో కదిలిన శాఖ
  4. ఉద్యోగుల భద్రతపై లోతుగా చర్చ 
  5. రోడ్లపై తనిఖీలు పెరిగితే వాహనదారులు మరింత అప్రమత్తం 
  6. త్వరలో రవాణా శాఖ చేతికి వాహనాలు  

హైదరాబాద్, జూలై 1౨ (విజయక్రాంతి): రోడ్లపై తిరిగే వాహనాలు.. అందు లో ప్రయాణించే ప్రజల ప్రాణాలు మాత్ర మే కాదు.. తనిఖీల కోసం నిత్యం రహదారులపైకి వచ్చే రవాణా శాఖ అధికారులు, సి బ్బంది భద్రతకూ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. ఇప్పటివరకు అనేక సవాళ్ల మధ్య వి ధులు నిర్వహిస్తున్న రవాణా శాఖకు త్వరలో ప్రత్యేక పెట్రోలింగ్ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. రవాణా శాఖకు 120 పెట్రోలింగ్ వాహనాల కొనుగోలుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారు. దీం తో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, సిబ్బందికి మరిం త భద్రత కలగనుంది. 

వెంకన్న మృతి ఘటనతో భద్రతపై ఆందోళన

ఇటీవల చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలు రవాణా శాఖలో భద్రతపై ఆందోళన పెంచాయి. ముఖ్యంగా వాహనాల తనిఖీల సమయంలో అధికారులు, సిబ్బంది ప్రాణాలకు ముప్పు ఏర్పడుతున్న ఘటనలు చర్చనీ యాంశంగా మారాయి. జూన్ మూడో వా రంలో భూపాలపల్లి జిల్లా ఇన్‌చార్జి రవాణా శాఖ అధికారి (డీటీవో) వెంకన్న వాహనాల తనిఖీలు చేస్తుండగా వేగంగా వచ్చిన బొగ్గు లారీ ఢీకొట్టడంతో మృతి చెందారు. ఈ ఘ టనపై ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించడంతో పాటు, రవాణా శాఖ సిబ్బంది భద్ర తపై ప్రత్యేక దృష్టి సారించారు. క్షేత్రస్థాయిలో తిరిగే అధికారులు, సిబ్బందికి పెట్రోలింగ్ వాహనాలను సమకూర్చాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటి వరకు ప్రైవేటు వాహనాలపైనే ఆధారం

రవాణా శాఖ అధికారులు, సిబ్బందికి ఇప్పటివరకు ప్రత్యేక పెట్రోలింగ్ వాహనాలు లేకపోవడంతో ప్రైవేటు వాహనాలను అద్దెకు తీసుకుని విధులు నిర్వహిస్తున్నారు. దీంతో తనిఖీల సమయంలో వాహనదారు లు రవాణా శాఖ సిబ్బందిని గుర్తించలేకపోవడం, అక్రమ రవాణాను అడ్డుకునే క్రమం లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. పోలీసు శాఖ తరహాలోనే రవాణా శాఖకూ ప్రత్యేక పెట్రోలింగ్ వాహనాలు అవసరమని సిబ్బంది ఉన్నతాధికా రుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలించి 120 వాహనాల కొనుగోలుకు అనుమతి ఇచ్చింది. 

రెడ్, బ్లూ లైట్లతో అలర్ట్

 రవాణా శాఖ పెట్రోలింగ్ వాహనాలకు ప్రత్యేక గుర్తింపు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. పోలీసు వాహనాల మాదిరిగా ప్రత్యే క లైట్ల ఏర్పాటు ద్వారా రోడ్డుపై వాహనదారులు ముందుగానే అప్రమత్తమయ్యే అవకాశం ఉంది. దీంతో వేగంగా వెళ్లే భారీ వా హనాల డ్రైవర్లు జాగ్రత్తలు పాటించే అవకా శం ఉండటంతో పాటు, రవాణా నిబంధనల అమలు మరింత సమర్థవంతంగా జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పైగా కొద్ది దూరం నుంచే బ్లూ, రెడ్ లైట్ల వాహనాలు కనపడటంతో.. వాహనాల డ్రైవర్లుకూడా అప్రమత్తం అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే రవాణా శాఖకు మహీం ద్రా కంపెనీకి చెందిన పెట్రోలింగ్ వాహనాలను కొనుగోలు చేయనున్నారు. దీనితోపా టు క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నప్పుడు కచ్చితంగా యూనిఫారం ధరించా లని, అలాగే ఇతరత్రా చట్టపరమైన, సాంకేతిక అంశాలనుకూడా పాటించాలని ఆదేశిం చినట్టు సమాచారం.

త్వరలో ప్రభుత్వానికి నివేదిక

భూపాలపల్లి డీటీవో వెంకన్న మృతి ఘటనపై శాఖాపరమైన విచారణ దాదాపు పూర్తయినట్లు సమాచారం. సంఘటన స్థలా న్ని పరిశీలించిన అధికారులు, పోలీసులు ప్రత్యక్ష సాక్షుల వివరాలు, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. విచారణ నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి అందించనున్నారు. అనంతరం రవాణా శాఖను మరింత పటి ష్టం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.