15 April, 2026 | 6:21 AM

మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

07-04-2025 07:41 PM

తాడ్వాయి (విజయక్రాంతి): నర్సరీలలో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తాడ్వాయి ఎంపీడీవో సాజిద్ అలీ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలోని నర్సరీని ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎండలు ఎక్కువవుతున్నందున మొక్కలు ఎండిపోకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.  నర్సరీలో మొక్కలు బాగా పెరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.