29-07-2025 12:24:32 AM
ఎల్బీనగర్, జులై 28 : హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం వి ద్యార్థుల కోసం ఇంగ్లీష్ విభాగం, కెరీర్ గైడెన్స్ సెల్, టీఎస్ కేసీ సంయుక్తంగా ’కెరీర్ గైడెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలపై అవగాహన సదస్సు’ను నిర్వహించారు. పోటీ పరీక్షల్లో కెరీర్ నిర్మాణ ఎంపికల ప్రాముఖ్యత, అందుబాటులో ఉన్న వివిధ కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ అవకాశాలను వివరించినట్లు కెరీర్ గైడెన్స్ సెల్ ఇంచార్జి దుర్గాప్రసాద్ తెలిపారు.
విద్యార్థులు అకడమిక్ మరియు పోటీ పరీక్షలు తమ కెరీర్ లక్ష్యాల గురించి స్పష్టత మరియు అవగాహన కలిగి ఉండాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సురేశ్ బాబు సూచించారు. ముఖ్య వక్త మహితా హాజరై, విద్యార్థులకు వివిధ కేంద్ర పోటీ పరీక్షలు, కెరీర్ నిర్మాణ అవకాశాల గురించి వివరణాత్మక వివరణ ఇచ్చారు.
కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఇందిర, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ బి. నర్సింహ, ఇంగ్లీష్ విభాగం అధిపతి డాక్టర్ డి.మక్లా, పి. విద్యా సాగర్, కెరీర్ గైడెన్స్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎ. దుర్గా ప్రసాద్, డాక్టర్ కృష్ణ మోహన్ డాక్టర్ వెంకటేశ్వర్లు. జెకెసి మెంటర్ వి.నాగరాజుపాల్గొన్నారు.