calender_icon.png 30 July, 2025 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్ఫూర్తిప్రదాత జైపాల్‌రెడ్డి

29-07-2025 12:23:20 AM

ఆమనగల్లు, జులై 28: దివంగత కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి స్ఫూర్తి ప్రధాత అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కొనియాడారు. సోమవారం జైపాల్ రెడ్డి ఆరవ వర్ధంతిని పురస్కరించుకొని నెక్లెస్ రోడ్ లోని ఆయన స్మారక స్థూపం వద్ద ఆయన కుటుంబ స భ్యులు, నియోజకవర్గ కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయనకు ఘన నివాళులర్పించారు.

జైపాల్ రెడ్డి గొప్ప దార్శనీ కత కలిగిన నేత అని, ఉత్తమ పార్లమెంటరీయన్ గా, అజాతశత్రువుగా అందరి చే త కీర్తింపబడ్డారని ఆయన గుర్తు చేశారు. జైపాల్ రెడ్డి కల్వకుర్తి ప్రాంత ముద్దుబిడ్డ కావడం త మకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

ఆయన చూపించిన అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు సేవ చేస్తానని ఆయన హామీని ఇచ్చారు. కల్వకుర్తి నియోజకవర్గం లో జైపాల్ రెడ్డి వర్ధంతి వేడుకలు ఆయా మండలాల్లో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి, చిత్రపటానికి ఆయ న అభిమానులు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.