18 March, 2026 | 6:33 PM

రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలి: ఏఓ శ్రీనివాస్

18-03-2026 04:53 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): అర్హులైన రైతులందరూ రైతు భరోసా పథకం లబ్ధి కోసం మార్చి 25వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని మఠంపల్లి మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్ కోరారు. బుధవారం కార్యాలయంలో దరఖాస్తుదారుల నుంచి దరఖాస్తులు తీసుకుని మాట్లాడుతూ ఫిబ్రవరి 28వ తేదీ నాటికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు. ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

దరఖాస్తుదారులు తమ దరఖాస్తు పత్రంతోపాటు పట్టాదారు పాస్ పుస్తకం,ఆధార్ కార్డు,బ్యాంక్ బుక్ నకలు ఫోన్ నెంబర్ జతచేసి సంబంధిత క్లస్టర్ పరిధిలోని రైతు వేదికలో వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలని ఆయన పేర్కొన్నారు.రైతులు ఈ గడువును గమనించి త్వరగా దరఖాస్తులను సమర్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు శ్రావ్య,త్రివేణి,సునీత, రైతులు తదితరులు పాల్గొన్నారు.