విశాఖపట్నంలో కార్స్ 24 కొత్త కస్టమర్ హబ్
విశాఖపట్నం, జూలై 23, 2026:
భారతదేశపు ప్రముఖ ఆటో టెక్ ప్లాట్‌ఫారమ్ అయిన కార్స్24 విశాఖపట్నంలో సెలెస్ట్ మాల్ వద్ద తమ సరికొత్త కస్టమర్ హబ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా విశాఖలో తమ రిటైల్ నెట్‌వర్క్‌ను విస్తరించడమే కాకుండా నగరంలోని వినియోగదారులకు తమ సాంకేతిక-ఆధారిత కార్ల కొనుగోలు , అమ్మకాల సేవలను మరింత దగ్గర చేస్తోంది. ఈ కొత్త హబ్ విశాఖపట్నంలో కార్స్24 చేస్తున్న నిరంతర పెట్టుబడిని ప్రతిబింబిస్తుంది. సెలెస్ట్ మాల్ లోని ఈ హబ్ కార్స్ 24కు ఒక కీలకమైన కస్టమర్ సేవా కేంద్రంగా పనిచేస్తుంది. కొనుగోలుదారులు, విక్రేతలు కంపెనీ యొక్క సమగ్ర సేవలను వినియోగించుకునే అవకాశం కలుగుతుంది.
ఈ ప్రారంభోత్సవం సందర్భంగా కార్స్ 24 వ్యవస్థాపకుడు విక్రమ్ చోప్రా మాట్లాడుతూ "విశాఖపట్నం మాకు ఒక ముఖ్యమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్. సౌకర్యవంతమైన,సాంకేతికతతో కూడిన కార్ల కొనుగోలు, అమ్మకాల అనుభవాన్ని వినియోగదారులు ఎక్కువగా కోరుకుంటుండటం మేము చూస్తున్నాము. సెలెస్ట్ మాల్ లోని ఈ కొత్త హబ్ ద్వారా మేము నగరంలోని మరింత మంది వినియోగదారులకు సేవలను అందించగలము. మా రిటైల్ నెట్‌వర్క్‌లో పెట్టుబడులు కొనసాగిస్తూనే, ప్రతి వినియోగదారునికి సరళమైన, వేగవంతమైన, నమ్మదగిన యాజమాన్య అనుభవాన్ని అందించడం లక్ష్యంగా చేసుకున్నామని తెలిపారు.






