ఎల్‌నినోపై రైతులకు అవగాహన
25-07-2026 09:07 PM
హుస్నాబాద్: అక్కన్నపేట మండలం మైసమ్మవాగు తండాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఎల్‌నినో ప్రభావం, ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ అధికారి తస్లీమా, వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీలత మాట్లాడుతూ... వర్షపాతం తగ్గే అవకాశాల నేపథ్యంలో కంది, పెసర, మినుము, నువ్వులు, జొన్న, సజ్జ, వేరుశెనగ వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. నేలలో తేమ సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, వాతావరణ శాఖ సూచనలను పాటిస్తూ వ్యవసాయ శాఖ సలహాల మేరకు సాగు పనులు చేపట్టాలని రైతులకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జయరాం నాయక్, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.






