పారమిత పాఠశాలలో కార్గిల్ విజయదినోత్సవ వేడుకలు
కొత్తపల్లి,(విజయక్రాంతి): స్థానిక పద్మనగర్ పారమిత హెరిటేజ్ పాఠశాలలో కార్గిల్ విజయ దినోత్సవ సందర్భంగా దేశభక్తి ఉట్టిపడేలా వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పారమిత విద్యాసంస్థల చైర్మన్ డా. ఇ. ప్రసాద్ రావు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా కల్నల్ ఎ.కె. జయంత, సుబేదార్ మేజర్ జాంగ్‌బజ్ ఖాన్, సుబేదార్ విజయ్ కుమార్, హవల్దార్ ప్రతాప్ హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చక్కటి దేశభక్తిని ప్రతిబింబించే నృత్యాలు, గీతాలు ఆలపించి కార్గిల్ యుద్ధ అమర వీరులకు నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాల యాజమాన్యం కల్నల్ ఎ.కె. జయంత గారితో పాటు, సుబేదార్ మేజర్ జాంగ్‌బజ్ ఖాన్, సుబేదార్ విజయ్ కుమార్, హవల్దార్ ప్రతాప్ గారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కల్నల్ ఎ.కె. జయంత మాట్లాడుతూ కార్గిల్ యుద్ధ వీరుల త్యాగాలను విద్యార్థులకు వివరిస్తూ, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించడం కూడా దేశసేవేనని పేర్కొన్నారు.
దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం ప్రతి విద్యార్థిలో పెంపొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పారమిత విద్యాసంస్థల చైర్మన్ డా. ఇ. ప్రసాద్ రావు కార్గిల్ అమరవీరులకు ఘన నివాళులర్పిస్తూ, విద్యార్థులందరూ సరియైన క్రమశిక్షణను అలవర్చుకుని మంచిగా చదువుకుని దేశప్రజలకు సేవ చేయాలని, అది సైనికులు దేశానికి చేసే సేవతో సమానం అని విద్యార్థులకు తెలియజేశారు.






