25 July, 2026 | 9:23 PM

నగరంపల్లిలో ఘనంగా బీరన్న బోనాల పండుగ

25-07-2026 08:51 PM

గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు

గణపురం,(విజయక్రాంతి):  గణపురం మండలంలోని నగరంపల్లి గ్రామంలో శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో భీరన్న బోనాల పండుగను శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ దేవతలకు, పోచమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి హనుమాన్ దేవాలయాల్లో పూజలు నిర్వహించారు.బీరన్న స్వామికి మహిళలు సాంప్రదాయ బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుండి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు నూతన వస్త్రాలు ధరించి ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. గ్రామ శాంతి, సౌభాగ్యం కోసం దేవతలను ప్రార్థించారు.