25 July, 2026 | 9:28 PM

త్రివేణి పాఠశాలలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమం

25-07-2026 08:56 PM

అమర వీర జవాన్లకు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ఘన నివాళులు

దేశం పట్ల ప్రేమ, క్రమశిక్షణ, బాధ్యత వంటి విలువలను అలవర్చుకోవాలి

సత్తుపల్లి,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా సత్తుపల్లి శాఖ త్రివేణి పాఠశాలలో శనివారం నాడు 25-07-2026 న కార్గిల్ విజయ్ దివస్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన అమర వీర జవాన్లకు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన నివాళులర్పించారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఎం. సరిత , క్యాంపస్ ఇన్‌చార్జ్ వంశీ సర్, అకడమిక్ ఇన్‌చార్జ్ పవన్ సర్, కిడ్స్ ఇన్‌చార్జ్ శ్రీ పద్మ మేడమ్ మాట్లాడుతూ, “దేశం మన మొదటి తల్లి. దేశాన్ని ప్రేమించడం, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడడం, దేశ సమగ్రతను కాపాడడం ప్రతి భారత పౌరుడి బాధ్యత. కార్గిల్ వీరుల త్యాగం మనందరికీ స్ఫూర్తిదాయకం. వారి దేశభక్తి, ధైర్యసాహసాలను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలి” అని సందేశమిచ్చారు.

అనంతరం పాఠశాల డైరెక్టర్ జి. వీరేంద్ర చౌదరి , సీఆర్వో మురళీకృష్ణ సర్ విద్యార్థులకు ప్రత్యేక సందేశాన్ని పంపిస్తూ, కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికుల త్యాగాలను ఎల్లప్పుడూ స్మరించుకోవాలని, దేశ భద్రత కోసం సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తించే సైనికుల సేవలను గౌరవించాలని, దేశభక్తి భావనను ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించి, అమర జవాన్లకు మౌనం పాటించి నివాళులర్పించారు. దేశం పట్ల ప్రేమ, క్రమశిక్షణ, బాధ్యత వంటి విలువలను అలవర్చుకోవాలని ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు.