25 July, 2026 | 9:30 PM

యూనివర్సల్ బుక్ ఆఫ్ గోల్డెన్ రికార్డ్స్ సాధించిన ప్రభుత్వ కళాశాల విద్యార్థిని

25-07-2026 08:54 PM

చందుర్తి,(విజయక్రాంతి): మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఎం.పీ.సీ. విద్యార్థిని శ్రీరాం శ్రీహిత ,2026 సంవత్సర ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో విశిష్ట స్థానం సంపాదించింది.విద్యార్థిని సాధించిన ఈ అసాధారణ విజయాన్ని గుర్తించిన యూనివర్సల్ బుక్ ఆఫ్ గోల్డెన్ రికార్డ్స్, హైదరాబాద్ సంస్థ ఆమెకు ప్రత్యేక ప్రశంసా పత్రం అందజేసి ఘనంగా సత్కరించింది. అంతేకాకుండా విద్యార్థిని విజయానికి కృషి చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాల, చందుర్తి  ప్రిన్సిపాల్ యం. విజయ లక్ష్మి కు కూడా ప్రశంసా పత్రాన్ని అందజేసి వారి సేవలను అభినందించింది.ఈ సందర్భంగా కళాశాల అధ్యాపక బృందం విద్యార్థిని సాధించిన విజయానికి హర్షం వ్యక్తం చేస్తూ, ఆమెను అభినందించారు. విద్యార్థిని విజయానికి తోడ్పడిన తల్లిదండ్రులను కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, వారి సహకారాన్ని ప్రశంసించారు.