18 July, 2026 | 12:59 PM

Breaking News

Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

ఎంపీ పప్పూ యాదవ్‌పై కేసు

12-06-2024 12:40 AM

రూ.కోటి డిమాండ్ చేశాడని వ్యాపారి ఫిర్యాదు

ప్రమాణస్వీకారం చేయకముందే అవినీతికి తెర

బీహార్‌లోని పూర్ణియాలో వెలుగు చూసిన ఘటన

పాట్నా, జూన్ 11: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చి వారమైనా కాలేదు. అప్పుడే బిహార్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఓ ఎంపీ దోపిడీకి తలుపులు తీసిన ఘటన వెలుగు చూసింది. ఓట్ల లెక్కింపు జరుగుతున్న రోజునే ఓ వ్యాపారిని బెదిరించి రూ.కోటి డిమాండ్ చేశాడు. వేధింపు లకు తాళలేని బాధితుడు సోమవారం పోలీసులను ఆశ్రయించాడు.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పూర్ణియా స్థానం నుంచి రాజేష్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ పోటీ చేసి గెలిచాడు. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు జరుగుతుండగా పప్పూ యాదవ్ ఓ వ్యాపారికి కాల్ చేశాడు. తన వద్దకు పిలిపించి రూ.కోటి డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు పూర్ణియా పోలీసులను ఆశ్రయించాడు. 2021 23 మధ్య పప్పూయాదవ్ తనను రెండుసార్లు తనను వేధించాడని, అడిగినంత సొమ్ము ముట్టజెప్పకపోతే చంపుతామని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

మరోవైపు కొందరు కుట్ర పన్ని మరీ తన ఎదుగుదలను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని ఎంపీ పప్పూ యాదవ్ ఆరోపిస్తున్నారు. తనను ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ‘ఎక్స్’ ద్వారా స్పందించారు. తను చట్టపరంగా ముందుకు వెళ్తానని, నిందితులకు ఉరిశిక్ష పడే వరకు పోరాడతానని స్పష్టం చేశారు.