12 May, 2026 | 8:58 PM

Breaking News

హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •   నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి   •  

సినీ నటుడు శ్రీతేజ్‌పై కేసు నమోదు

27-11-2024 01:31 AM

పెళ్లి చేసుకుంటానని మోసగించాడని కూకట్‌పల్లి పీఎస్‌లో మహిళ ఫిర్యాదు

లక్ష్మీస్ ఎన్టీఆర్, వంగవీటి, నారప్పతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు

కూకట్‌పల్లి, నవంబర్ 26 : తెలుగు సినీ నటుడు శ్రీతేజ్‌పై కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు మరో మహిళతో సన్నిహితంగా ఉంటూ తనను వద్దంటున్నాడని ఓ మహిళ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ అజీజ్‌నగర్ లో నివాసం ఉంటే ఓ మహిళ (35)కు.. ముసాపేట ఆంజనేయనగర్‌లో నివాసముంటున్న శ్రీతేజ్‌తో 2014లో ఓ ఈవెంట్‌లో పరిచయం ఏర్పడింది.

అనంతరం సోషల్ మీడియా ద్వారా వారిరువురు మరింత దగ్గరయ్యారు. ఈ క్రమంలో తనతో శ్రీతేజ్‌కు వివాహేతర సంబంధం కొనసాగుతోందని మహిళ ఆరోపించింది. ఈ క్రమంలోనే శ్రీతేజ్ తనవద్ద నుంచి 20లక్షల రూపాయలు తీసుకోవడంతో పాటు ఎలక్ట్రికల్ వాహనాలు తీసుకొని ఆర్థికంగా తనను మోసం చేశాడని బాధితురాలు ఆదివారం కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేయడమే కాకుండా ఆర్థికంగా తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేశాడని ఫిర్యాదులో పేర్కొంది.

అయితే సదరు మహిళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్‌ఐఆర్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసుని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. శ్రీతేజ్ లక్ష్మీస్ ఎన్టీర్, వంగవీటి, నారప్ప, పుష్ప2 వంటి ప్రధాన చిత్రాల్లో నటించారు.