12 May, 2026 | 10:00 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

మంచి మనసున్న మంత్రి..

27-11-2024 01:28 AM

జనగామ, నవంబర్ 26 (విజయక్రాంతి): కాళ్లకు చెప్పులు లేకుండా ఎండ లో దీనస్థితిలో నడుస్తున్న ఓ బాలికను చూసి మంత్రి కొండా సురేఖ చలించిపోయారు. తన కాన్వాయ్ ఆపి ఆ పాపకు చెప్పులు, దుస్తులు కొనిచ్చి ఉదారతను చాటుకున్నారు. మంత్రి కొండా సురేఖ మంగళవారం పెద్దపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వరంగల్ నుంచి బయలుదేరారు.

మార్గమధ్యంలో సుల్తానాబాద్ మార్కెట్ చౌరస్తా వద్ద బిహార్‌కు చెందిన ఓ బాలిక కాళ్లకు చెప్పులు లేకుండా ఎండలో వెళ్తుండటాన్ని మంత్రి గమనించారు. వెంటనే తన కాన్వాయ్ ఆపి పాప దగ్గరికి వెళ్లారు. దగ్గ రే ఉన్న చెప్పుల షాపులోకి తీసుకెళ్లి రెండు జతల చెప్పులు కొనిచ్చారు. పక్కనే ఉన్న వస్త్ర దుకాణానికి తీసుకెళ్లి దుస్తులు కొనిచ్చారు.

పాప తల్లిదండ్రులతో మాట్లాడగా బతుకుదెరువు కోసం తెలంగాణకు వచ్చి కూలీ పనులు చేసుకుంటున్నట్లు తెలిపారు. మంత్రి కొండా సురేఖ కాన్వాయ్ ఆపి బాలికకు చెప్పులు, దుస్తులు కొనివ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది.