30 June, 2026 | 10:06 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి

12-05-2026 07:49 PM

భవన నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్

మే 16 నుండి పనులు బంద్

జవహర్ నగర్,(విజయక్రాంతి): నిర్మాణరంగంలో ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరిగినందున ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నిర్మాణదారులకు నూతన ధరలు చెల్లించాలని జవహర్ నగర్ నిర్మాణ రంగ కాంట్రాక్టర్లు సమ్మె బాట పట్టారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, పరిధిలోని కీసర సర్కిల్, జవహర్ నగర్ బాలాజీ నగర్ పరిధిలోని భవన నిర్మాణ కార్మికులు,  నిర్మాణ రంగంలో ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరగడం, పెరిగిన నిత్యావసర ధరలు  ఇంటి అద్దెల దృష్ట్యా పాత ధరలకు పనులు చేయడం సాధ్యం కాదని కార్మిక సంఘం,అధ్యక్షులు కొయ్యడ వెంకటేష్,ప్రధాన కార్యదర్శి బూడిద వెంకటేష్,స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు పలు డిమాండ్లను తెలియజేశారు ప్రధాన డిమాండ్లు, పెరిగిన ధరల వివరాలు నిర్మాణ రంగానికి సంబంధించి సెంట్రింగ్, ఇసుక, కంకర, స్టీల్, సిమెంట్, ఎలక్ట్రికల్  ప్లంబింగ్ మెటీరియల్ ధరలు పెరగడం వల్ల కాంట్రాక్టర్లు భారీగా నష్టపోతున్నారని సంఘం ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో నూతన ధరలను ఈ క్రింది విధంగా డిమాండ్ చేస్తున్నారు:

 క్వాలిటీ 1 (మెటీరియల్ తో కలిపి): చదరపు అడుగుకు 2,600

క్వాలిటీ 2 (మెటీరియల్ తో కలిపి) చదరపు అడుగుకు 2,300

 కేవలం లేబర్ ఛార్జీ: చదరపు అడుగుకు రూ,550

 మే 16 నుండి రెండు వారాల పాటు సమ్మె

తమ డిమాండ్లు నెరవేరే వరకు ఈ నెల 16/05/2026 నుండి రెండు వారాల పాటు పనులు నిలిపివేస్తున్నట్లు సంఘం ప్రకటించింది. ఈ సందర్భంగా గల్లీ గల్లీ తిరుగుతూ అవగాహన కల్పిస్తామని, భవన యజమానులు అనుభవం కలిగిన వారు తమ కష్టాన్ని గుర్తించి సహకరించాలని కోరారు. పెరిగిన ధరల వల్ల చేసిన కష్టానికి గిట్టుబాటు కావడం లేదు. కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. న్యాయమైన ధరలు లభించే వరకు మా పోరాటం ఆగదన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులుఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కోయాడ వెంకటేష్, అధ్యక్షులు చిన్నపురం యాదయ్య, ప్రధాన కార్యదర్శి బూడిద వెంకటేష్, ఉపాధ్యక్షులు మరాటి బాబు, రమణారెడ్డి, కోశాధికారి కోట్ల చెన్నారెడ్డి, మాధవ్, ఏ.ఎఫ్.టి.యు  రాష్ట్ర నాయకులు వై. మల్లేష్, శ్రీను, వెంకటేష్, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.