15 July, 2026 | 12:41 AM

సారా తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

15-07-2026 12:00 AM

పాలకీడు, జులై 14: సారాను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తినీ పట్టుకొని అతనిపై కేసు నమోదు చేసిన ఘటన మంగళవారం శూన్యపహాడ్ గ్రామంలో జరిగింది. ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని శూన్యపహాడ్ కు చెందిన రామావత్ రాముడు అను వ్యక్తి తన బజాజ్ పల్సర్ వాహనంపై సారాను తరలిస్తుండగా పట్టుకున్నట్టు తెలిపారు. తదుపరి ఎక్సైజ్ అధికారి దివ్య వాహనంను సీజ్ చేసి 8 లీటర్ల సారా ను స్వాధీనం చేసుకుని ఆ వ్యక్తి పై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. పట్టుకున్న వారిలో కానిస్టేబుల్ సుధాకర్, శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.