07-12-2025 10:02:44 PM
నంగునూరు: మండల పరిధిలోని కోనాయిపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి నిమ్మ ప్రతిభా రెడ్డిపై ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు కేసు నమోదైంది. ఆదివారం మధ్యాహ్నం 01:45 గంటలకు ప్రతిభా రెడ్డి తన ఇంటి వద్ద ఓటర్లను ప్రలోభపెట్టేందుకు భోజనం ఏర్పాటు చేసినట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ కి సమాచారం అందిందని, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పయ్యవుల లింగం ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదు చేసినట్లు రాజగోపాల్‌పేట ఎస్ఐ టి. వివేక్ తెలిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని తెలిపారు.