calender_icon.png 8 December, 2025 | 8:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత రాజ్యాంగ రూపకర్తకు ప్రజాసంఘాల ఘన నివాళి!

07-12-2025 09:00:23 PM

కాటారం (మహా ముత్తారం) (విజయక్రాంతి): మహా ముత్తారం మండల కేంద్రంలో డా బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్బంగా ప్రజా సంఘల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆధునిక భారతదేశ చరిత్రలో అంబేడ్కర్‌కు అత్యంత ప్రాముఖ్యం ఉందన్నారు. దేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులను సరిసమానం చేసేందుకు కృషి చేసిన వ్యక్తిగా డా. బీఆర్‌ అంబేడ్కర్ ను వర్ధంతి సందర్భంగా పలువురు వక్తలు కొనియాడారు.

దళిత కుటుంబంలో జన్మించి, ఎన్నో కష్టాలు పడి, పోరాటాలు, త్యాగాలు చేసి భారత రాజ్యాంగం అనే గ్రంథాన్ని రచించిన ఒక విశిష్ట సంఘ సంస్కర్తగా మాత్రమే నేటి పాలకులు అంబేడ్కర్‌ను పరిమితం చేశారనీ, కానీ, అణగారిన వర్గాలకు ఏ లక్ష్యాలను సాధించుకోవాలని చెప్పాడో వాటిని నేటి పాఠ్యాంశాల్లో చేర్చకపోవడం దేశ అగ్రవర్ణ పాలకుల స్వార్థబుద్ధికి నిదర్శనమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

భారత ప్రజలందరి మధ్య ‘స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, ప్రజాస్వామ్య, గణతంత్ర భావాలు విరజిల్లాలని ఆశీస్తూ ఆయా అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు పీక కిరణ్, జాతీయ మాల మహానాడు మంథని నియోజకవర్గ ఇంచార్జి కందుగుల రాజన్న, అల్ ఇండియా అంబేద్కర్ యువజన మండల అధ్యక్షులు రామగిరి రాజు, మండల ప్రధాన కార్యదర్శి లింగమళ్ళ శంకర్, బోట్ల నరేష్  పాల్గొన్నారు.