24 August, 2026 | 11:46 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

వరుణ్ ఆసుపత్రి డాక్టర్ పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

28-06-2025 10:06 AM

భద్రాద్రి కొత్తగూడెం: ఆరోగ్యశ్రీ అనుమతులు లేకుండా ఆరోగ్యశ్రీ సేవలు ఉన్నట్లు రోగులను మోసం చేస్తున్నారని ఆరోపణపై జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో గల వరుణ్ ఆర్థోపెటిక్, మల్టీస్పెషల్టి ఆసుపత్రి డాక్టర్ వరుణ్ కుమార్(Multispeciality Hospital Dr. Varun Kumar)పై 3 వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. వరుణ్ ఆర్థోపెటిక్ వైద్యునీ వ్యవహారంపై గతంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి భాస్కర్ నాయక్ ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు లేకపోవడంతో, చివరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆరోగ్యశ్రీ మేనేజర్ పర్వతపు వరుణ్ కుమార్ పై ఫిర్యాదు చేశారు. ఆరోగ్యశ్రీ సౌకర్యాలు ఉన్నాయ్ అంటూ వరుణ్ కుమార్ జిల్లా వ్యాప్తంగా హోర్డింగులు పెట్టడంతో పాటు కేసులో కూడా ప్రచారం చేసుకోవడం గమనార్హం. ఈ మేరకు మూడవ పట్టణ ఎస్సై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.