28 July, 2026 | 1:12 PM

Breaking News

మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •   కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •  

నార్కోటిక్ జాగిలం సహాయంతో గంజాయి స్వాధీనం.. కేసు నమోదు

26-05-2026 02:51 PM

బోథ్, మే 26 (విజయక్రాంతి):  జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు బోత్ సిఐ గురుస్వామి ఏ ఆర్ డి ఎస్ పి ఇంద్ర వర్ధన్ తెలిపారు. మంగళవారం సోనాల మండలంలోని గుట్ట పక్క తాండ గ్రామంలో కార్బన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నార్కోటిక్ జాగిలం రోమా సహాయంతో 20 గ్రాముల గంజాయి పట్టుకోవడం జరిగిందన్నారు.

జాగిలం అనుమానాస్పద ప్రాంతాలను పరిశీలిస్తూ తనిఖీలు నిర్వహించగా గ్రామానికి చెందిన రాథోడ్నియాసింగ్ వద్ద గంజాయి నిలువ ఉన్నట్టు గుర్తించడంతో ఒక వంద 20 గ్రాముల గంజాయి లభించిందన్నారు.దీంతో గంజాయి స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు .జిల్లాలో యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని వాటిని విక్రయించిన రవాణా చేసిన చట్టరీత్యా చర్యలు తప్ప ఉన్నారు.ఎవరైనా గంజాయి విక్రయించిన సేవించిన సాగుచేసిన తమ దృష్టికి తీసుకురావాలన్నారు.ఈ సందర్భంగా బోథ్ నేరడిగొండ బజార్హత్నూర్ ఎస్సైలు క్యూఆర్టి ఫోర్స్ సివిల్ సిబ్బంది బి డి టీం సభ్యులు పాల్గొన్నారు