17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

లోక్ అదాలత్ లో 617 కేసులు పరిష్కారం

11-06-2025 11:03 PM

చేవెళ్ల: జాతీయ న్యాయ సంస్థ అదేశాల మేరకు చేవెళ్ల కోర్టు(Chevella Court)లో జూన్ 9 నుంచి 11 వరకు నిర్వహించిన లోక్ అదాలత్(Lok Adalat)లో 617 కేసులు పరిష్కరించి రూ.  11,19,850 జరిమానా విధించామని చేవెళ్ల సీనియర్ న్యాయ మూర్తి దశరథ రామయ్య(Senior Justice Dasharatha Ramaiah) తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 14 వరకు లోక్ అదాలత్ కొనసాగుతుందని, ఆ లోపు డ్రంకన్ డ్రైవ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, ఇతర సివిల్, క్రిమినల్ తగాదాలు ఉన్న వాళ్ళు లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ న్యాయమూర్తి  కొత్త రవి,స్పెషల్ రిటైర్డ్ న్యాయమూర్తి కే లక్ష్మన్, చేవెళ్ల ట్రాఫిక్ సి ఐ వెంకటేశం, చేవెళ్ల ఎస్ హెచ్ ఓ భూపాల్ శ్రీధర్, శంకరపల్లి ఎస్ హెచ్ ఓ శ్రీనివాస్ గౌడ్, షాబాద్ ఎస్ హెచ్ ఓ కాంతా రెడ్డి, మొకిల ఎస్ హెచ్ ఓ వీర బాబు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.